Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాసినోపై కొడాలి నాని సవాల్ : నిరూపిస్తే తగలబెట్టుకుంటా!

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (15:58 IST)
గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్లో కేసినో ఆటను నిర్వహించారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. 
 
తన కల్యాణమంటపం రెండున్నర ఎకరాల్లో ఉంటుందని... అక్కడ కేసినోలు, పేకాట వంటివి నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. 
 
తన కన్వెన్షన్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో, లేదో చెప్పడానికి గుడివాడ ప్రజలు ఉన్నారని... టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అవసరం లేదని నాని అన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు. 
 
క్యాసినో వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధానాస్త్రంగా మలుచుకుంటోంది. ఆ పార్టీకి చెందిన నేతలు నిజనిర్ధారణ కోసం గుడివాడకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆరోపణలపై కొడాలి నాని తీవ్రంగా ప్రతిస్పందించారు.
 
ఈరోజు నిజనిర్ధారణకు వచ్చినవాళ్లంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారేనని చెప్పారు. రాష్ట్రంలో అన్ని చోట్ల జూదం జరిగిన విధంగానే గుడివాడలో కూడా జరిగిందని అన్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం అందిన వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని చెప్పారు. చంద్రబాబుకు, నారా లోకేశ్‌కు కేసినోలు బాగా తెలుసని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు 3,500 అడుగులు వేయాల్సిందే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments