ముంబైలో బాలుడు అపహరణ - జగ్గయ్యపేటలో గుర్తింపు!

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (10:20 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో అపహరణకుగురైన బాలుడి ఆచూకీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటలో గుర్తించారు. ఈ బాలుడు గత యేడాది ఫిబ్రవరిలో కిడ్నాప్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు ఆ బాలుడి ఆచూకీ యేడాదికి లభించింది. విజయవాడకు చెందిన ఓ మహిళ ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, జగ్గయ్యపేటకు చెందిన ఓ మహిళకు రూ.2 లక్షలకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. 
 
విజయవాడ చెందిన ఓ మహిళ ముంబైలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసి దేచుపాలెయంలోని తమ బంధువైన మహిళకు రూ.2 లక్షలకు విక్రయించింది. అయితే, ఈ బాలుడు జగ్గయ్యపేటలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం ఆ స్కూల్ వార్షికోత్సవం జరిగింది. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ బాలుడిని గుర్తించి రక్షించారు. బాలుడికి సంబంధించిన ఆధారాలను పెంచుకుంటున్న తల్లిదండ్రులకు చూపించి ఆ బాలుడిని తమతో తీసుకెళ్లిపోయారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, బాలుడిని కిడ్నాప్ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తే బాలుడిని శ్రావణి అనే మహిళ కిడ్నాప్ చేసి విక్రయించినట్టు వెల్లడించడమే కాకుండా, బాలుడి ఆచూకీని కూడా తెలిపిందని చెప్పారు. మరోవైపు, గత యేడాదికాలంగా ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు ఒక్కసారిగా దూరం కావడంతో బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments