Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీ కేసులో జైలు శిక్ష: కంది కారాగారంలో ఫినాయిల్ తాగి ఖైదీ ఆత్మహత్య..

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కారాగారంలో ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇతడు ఫినాయిల్ తాగడాన్ని గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం అందించారు. అ

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (15:54 IST)
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కారాగారంలో ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇతడు ఫినాయిల్ తాగడాన్ని గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం సింగారం గ్రామానికి చెందిన కరుణాకర్‌ (20) అనే ఖైదీకి 2016 సంవత్సరంలో చోరీ కేసులో శిక్ష పడింది. ఇతడు కంది జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళవారం ఉదయం కరుణాకర్‌ ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
 
గమనించిన తోటి ఖైదీలు విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు. దీంతో జైలు అధికారులు అతనిని సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరుణాకర్‌ మృతి చెందాడని సంతోష్‌కుమార్‌ రాయ్‌ తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం మిస్టరీ వీడింది. కాకతీయ కాలువలో బట్టలు ఉతికేందుకు వెళ్లిన విద్యార్థినులు కాలువలో శవాలై తేలారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments