Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆస్తులను జాతికి అంకితం చేయాలి.. మద్రాస్ హైకోర్టులో పిల్.. వారసులు లేరట..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. ఆమె ఆస్తులపై ప్రస్తుతం చర్చ మొదలైంది. జయలలి ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (15:42 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. ఆమె ఆస్తులపై ప్రస్తుతం చర్చ మొదలైంది. జయలలి ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని తమిళనాడుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది. 
 
డిసెంబర్‌ 5న మృతిచెందిన జయలలితకు వారసులెవరూ లేని కారణంగా జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ వ్యవహారం అంతా నిర్వహించేందుకు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని పిటిషనర్ కోరారు. 
 
ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చుచేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు జయ ఆస్తుల వివరాలను పొందుపరుస్తూ అఫిడవిట్‌ను కూడాపిటిషన్‌తో పాటు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.
 
కాగా గతంలో హైదరాబాద్‌లోని జయలలిత ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వారసులు లేనందున జయ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవాలని గరీబ్ గైడ్ ఇంటర్నేషనల్ సంస్ద న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై విచారించిన కోర్టు జయలలిత సోదరుడు ఉండగా.. హిందూ చట్టం ప్రకారం వారసులు లేరని మీరెలా అంటారని పిటీషనర్‌ను ప్రశ్నించింది. 
 
ప్రచారం కోసమే పిటీషన్ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో జయ ఆస్తులపై తమిళనాడు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందోనని అన్నాడీఎంకే కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments