Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా ధర ఢమాల్.. బోరుమంటున్న రైతులు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (11:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, మదనపల్లెలు టమోటా మార్కెట్‌లు కీలకంగా ఉన్నాయి. ఇక్కడ నుంచే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. 
 
అయితే, గత కొన్ని రోజులుగా టమోటా ధర భారీగా పడిపోయింది. ఒకవైపు దిగుబడి పెరిగిపోవడం, మరోవైపు వర్షాల కారణంగా విక్రయాలు పడిపోవడంతో ఈ వీటి ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో కర్నూలు మార్కెట్‌లో కిలో టమోటాల ధర రూ.2గా పలుకుతోంది. దీంతో టమోటా రైతులు బోరుమంటున్నారు. 
 
మార్కెట్‌కు తీసుకొచ్చిన టమోటాను అమ్మలేక, అలాగని తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్‌లోనే వాటిని పారబోస్తున్నారు. మార్కెట్‌కు బుధవారం 350 క్వింటాళ్ళ టమోటా వచ్చింది. వాటిలో ఓ మాదిరిగా ఉన్న టమోటా ధర కేజీ రూ.4 పలుకగా మిగితా వాటికి కిలోకు అర్థ రూపాయి కూడా రాదని వ్యాపారులు చెప్పడంతో రైతులు నిర్ఘాంతపోయారు. 
 
దీంతో దిక్కుతోచని రైతులు వాటిని అక్కడే పారిబోసి వెళ్లిపోయారు. ఒక ఎకరాలో టమోటా పంట పండించేందుకు రైతు రూ.30 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. తీరా పంటకు చేతికి వచ్చాక వాటి ధరలు అమాcతం పడిపోవడంతో వారు బోరున విలపిస్తున్నారు. 
 
అయితే, ప్రధాన మార్కెట్‌లో పరస్థితి దారుణంగా ఉంటే, బహిరంగ మార్కెట్‍‌లో మాత్రం కిలో టమోటా ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments