ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్టుల్లో 1520 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 11వ తేదీతో గడువు ముగియనుంది.
ఈ 1520 పోస్టుల్లో జిల్లాల వారీగా పరిశీలిస్తే, అనంతపురం జిల్లాలో 92, చిత్తూరులో 168, తూర్పుగోదావరి జిల్లాలో 156, గుంటూరులో 147, కడపలో 83, కృష్ణాలో 204, కర్నూలులో 91, నెల్లూరులో 104, ప్రకాశంలో 98, శ్రీకాకుళంలో 87, విశాఖపట్టణంలో 125, విజయనగరంలో 57, పశ్చిమగోదావరిలో 108 చొప్పున పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 01-07-2022 నాటికి 18 నుంచి 42 యేళ్ళ మధ్యలో ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.61960 చెల్లిస్తారు.
అర్హులైన అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపకి చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈ నెల 11వ తేదీ లోపు చేయాల్సివుంటుంది. పూర్తి వివరాల కోసం https://hc.ap.nic.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.