Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ శాసనసభ రద్దుకు ముహూర్తం ఖరారు...

తెలంగాణ రాష్ట్ర శాసనసభ త్వరలోనే రద్దుకానుంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనేకంగా ఈనెల 5 లేదా 6వ తేదీల్లో మరోమారు రాష్ట్ర మం

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (13:28 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ త్వరలోనే రద్దుకానుంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనేకంగా ఈనెల 5 లేదా 6వ తేదీల్లో మరోమారు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఇందులో అన్ని విషయాలపై చర్చించి అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన భావిస్తున్నారు.
 
నిజానికి ముందస్తు ఎన్నికల వస్తాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆదివారం కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేవలం పాలనాపరమైన అంశాలకే పరిమితమైనట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.... అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాంతో అసెంబ్లీ రద్దు సిఫారసు చేయడం కోసం ప్రత్యేకంగా కేబినెట్‌ సమావేశం ఈ నెల 5-6 తేదీల్లోఒకరోజు జరిగే అవకాశం ఉంది.
 
ఈ సమావేశంలో ఇతర అంశాలేవి లేకుండా నేరుగా అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపించాలని ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆయా విభాగాలకు సర్క్యూలర్‌ జారీచేశారు. శాసనసభ రద్దుకు సీఎం ముహూర్తం ఖరారు చేయడం వల్లే  సీఎస్ ఈ సర్క్యులర్ జారీ చేసివుంటారని తెరాస శ్రేణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments