Webdunia - Bharat's app for daily news and videos

Install App

పయ్యావుల కేశవ్‌కు కెసిఆర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదేనట...

పరిటాల శ్రీరామ్ వివాహం కంటే ఆ వివాహానికి వచ్చిన పయ్యావుల కేశవ్, కెసిఆర్‌లు కలవడం మాత్రం తీవ్ర చర్చకు తెరతీసింది. అందులోను హెలిప్యాడ్ వద్ద కెసిఆర్, పయ్యావుల కేశవ్‌ను చేతులు పట్టుకుని మరీ తీసుకెళ్ళడం మరింత చర్చకు దారితీసింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (15:41 IST)
పరిటాల శ్రీరామ్ వివాహం కంటే ఆ వివాహానికి వచ్చిన పయ్యావుల కేశవ్, కెసిఆర్‌లు కలవడం మాత్రం తీవ్ర చర్చకు తెరతీసింది. అందులోను హెలిప్యాడ్ వద్ద కెసిఆర్, పయ్యావుల కేశవ్‌ను చేతులు పట్టుకుని మరీ తీసుకెళ్ళడం మరింత చర్చకు దారితీసింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ పార్టీపై కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఈ నాయకుడు ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
 
గతంలో కెసిఆర్‌కు పయ్యావుల కేశవ్‌కు మధ్య మంచి పరిచయాలే ఉన్నాయి. ఆ పరిచయం కాస్త కొన్నిరోజుల క్రితం అనంతపురంకు వచ్చిన సమయంలో కేశవ్‌కు బాగానే కలిసొచ్చింది. హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పయ్యావుల కేశవ్‌కు కెసిఆర్ అవకాశం ఇచ్చారట. హైదరాబాద్‌కు వచ్చెయ్.. ఆ ప్రాంతం నీకేమీ కొత్తకాదు. 
 
వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి గెలుస్తావు. ఆ తరువాత మంత్రి పదవి నీకు ఖాయం. నా మాట విను అంటూ చెప్పుకొచ్చారట. అయితే పయ్యావుల కేశవ్ మాత్రం దీనిపై ఆలోచనలో పడిపోయినట్లు సమాచారం. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. అందులోను అనంతపురం జిల్లాలో ఉండే తను హైదరాబాద్‌కు వెళితే ఎలా ఉంటుందోనన్న ఆలోచనలో ఉండిపోయారు కేశవ్. కాస్త ఆలోచించుకునే సమయం ఇవ్వండని కెసిఆర్‌ను కోరినట్లు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments