Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బాలయ్యా ఇదేం గోలయ్యా' అంటూ మండిపడుతున్న నెటిజన్లు (Video)

సినీ నటుడు బాలకృష్ణ మరోమారు రెచ్చిపోయారు. తనకు కోపం వస్తే ఎలా రెచ్చిపోతోనో మరోమారు చూపించారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య.

Advertiesment
'బాలయ్యా ఇదేం గోలయ్యా' అంటూ మండిపడుతున్న నెటిజన్లు (Video)
, బుధవారం, 4 అక్టోబరు 2017 (14:12 IST)
సినీ నటుడు బాలకృష్ణ మరోమారు రెచ్చిపోయారు. తనకు కోపం వస్తే ఎలా రెచ్చిపోతోనో మరోమారు చూపించారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా... అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. తమ అభిమాన నటుడే కదా అని సెల్ ఫోన్‌లో ఓ సెల్ఫీ తీసుకోవాలనుకుంటే.. ఫోన్ నేలకేసి కొడతారు.
 
సినిమా సెట్లో అసిస్టెంట్ వచ్చి కాళ్లకు చెప్పులు తొడగటం ఆలస్యమైనా అంతే! గూబ గుయ్ మనిపిస్తారు. మొన్నామధ్య నంద్యాల ప్రచారంలోనూ బాలకృష్ణ తన అభిమాని చెంప చెళ్లుమనిపించారు. గజమాల వేసిన ఆనందం అరక్షణంలో ఆవిరయ్యేలా చేసిన బాలయ్య ప్రతాపానికి ఆ అభిమాని బిక్కచచ్చి పోయాడు. తనకి తెలిసిన వారైతేనే బాలకృష్ణ ఫోటోకి ఫోజిస్తారు. లేదంటే.. అభిమానికి అవమానం తథ్యం. 
 
ఇదే ఒరవడిలో మంగళవారం మరో అభిమాని చెంప పగలగొట్టారు బాలయ్య. అనంతపురం జిల్లా హిందూపురం బోయపేటలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై బాలకృష్ణను అడుగడుగునా జనం నిలదీశారు. అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ఆయన తనను దాటుకుని ముందుకెళ్తున్న ఓ అభిమానిపై వీరావేశాన్ని ప్రదర్శించారు. 
 
ఆగ్రహంతో ఆ అభిమాని చెంప ఛెళ్లుమనిపించారు. స్వర్గీయ ఎన్టీఆర్‌, తమను గుండెల్లో గుడికట్టుకుని పూజించే అభిమానులనే దేవుళ్లుగా అభివర్ణించేవారు. అయితే ఆయన నట, రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలయ్య.. ఇలా అభిమానులపై పదేపదే చేయి చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విపక్ష నేతలకు మంచి అస్త్రంగా కూడా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అయితే బాలయ్య బాబును మరింతగా ఏకిపారేస్తున్నారు. బాలయ్యా ఇదేం గోలయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడుపులో బంగారం బిస్కెట్లు... మల విసర్జన చేసి 16 బయటకు...