చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో కవిత.. అమరావతికి రాక.. ఆ సదస్సులో వేదిక పంచుకుంటారా?

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు కవిత హాజరుకానున్నారు. మన దేశం

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:17 IST)
నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు కవిత హాజరుకానున్నారు. మన దేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా అనేకమంది డెలిగేట్స్ ఈ సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు అమరావతికి చేరుకున్నారు.
 
అలాగే టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధులు కూడా ఈ సదస్సు కు రానున్నారు. శుక్రవారం కవిత అమరావతికి చేరుకుని సదస్సులో పాల్గొంటారు. అమరావతి పర్యటన సందర్భంగా కవిత విజయవాడ దుర్గమ్మను కూడా దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారని సమాచారం. ఈ సదస్సులో ఏపీకి చెందిన మంత్రులతో పాటు, కేంద్ర మంత్రులు వెంకయ్య, స్మృతి ఇరానీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సదస్సులో పాల్గొంటారు. 
 
కేరళ, కొన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, నాలుగు రాష్ట్రాల నుంచి స్పీకర్లు హాజరు కానున్నారు. శ్రీలంక ప్రథమ మహిళ మైత్రేయి విక్రమసింఘె, అమెరికా చట్ట సభ ప్రతినిధి అరుణ్‌మిల్లర్‌, కెన్యా నుంచి నలుగురి రాక ఖరారైందని సమాచారం. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం కోడలు బ్రాహ్మణి కూడా పాల్గొంటారు. దీంతో కవిత.. బ్రాహ్మణితో కలిసి వేదిక పంచుకుంటారా అనేది తెలియాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments