Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ బే రిసార్ట్‌‌లో ఎమ్మెల్యేల ఎంజాయ్‌మెంట్.. పన్నీర్ వెంట పోతారా? చిన్నమ్మకు ఓటేస్తారా?

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం చెంతకు తన క్యాంప్ ఎమ్మెల్యేలు చేరిపోకుండా శశికళ అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేలు తన చేయి దాటిపోకుండా, పన్నీర్‌సెల్వం చెంతకు చేరకుండా ఆపేందుకు అందర్నీ తన కట్టుబాటులో

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (09:45 IST)
తమిళనాడు ఆపద్ధర్మ సీఎం  పన్నీర్ సెల్వం చెంతకు తన క్యాంప్ ఎమ్మెల్యేలు చేరిపోకుండా శశికళ అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేలు తన చేయి దాటిపోకుండా, పన్నీర్‌సెల్వం చెంతకు చేరకుండా ఆపేందుకు అందర్నీ తన కట్టుబాటులో పెట్టుకొనే ప్రయత్నానికి దిగారు. అందరినీ రెండు బస్సుల్లో నగరానికి దూరంగా రిసార్ట్స్‌లో ఉంచారు. ఈ చర్యతో శశికళ తీవ్ర విమర్శలు, కోర్టులో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
తన క్యాంప్ ఎమ్మెల్యేలు జారిపోకుండా శశికళ హోటల్‌పై దృష్టి పెట్టింది. గత బుధవారం అన్నాడీఎంకే కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తరువాత 120 మందికిపైగా ఎమ్మెల్యేలను రెండు లగ్జరీ బస్సుల్లో శశికళ ఎక్కించి పంపించివేశారు. తొలుత విమానాశ్రయం సమీపంలోని స్టార్‌ హోటల్‌లో ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేయగా, రాత్రికి వారి బస మహాబలిపురం సమీపంలోని కల్పాక్కం వద్ద ఉన్న గోల్డెన్ బే రిసార్ట్‌కి మారింది. ఈ రిసార్టు ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులోని కూవత్తూర్‌ ప్రాంతంలో ఉంది. చుట్టూ నీళ్లతో ఒక దీవిని తలపించేలా ఈ రిసార్ట్ ఉంటుంది. 
 
అంతేకాదు, చల్లగా వీచే సముద్రగాలి ఈ రిసార్ట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ హోటల్‌లో ఎమ్మెల్యేలు లగ్జరీగా గడిపేందుకు రోజుకి రూ.5,500, రూ.6600, రూ.9,900ల ధరతో మూడు విధాలైన రూములున్నాయి. పార్టీ హాలు, డిన్నర్‌ హాలు సదుపాయాలున్నాయి. షికారు చేసేందుకు బోటింగ్‌, బోటులోనే డిన్నర్‌, సాహస క్రీడల్లో ఆసక్తి ఉన్నవారి కోసం ట్రెక్కింగ్‌, మోటార్‌ సైక్లింగ్‌ వంటి మరిన్ని వసతులున్నాయి. మసాజ్‌ సెంటర్‌, జిమ్‌‌కూడా ఇందులో భాగమే. 
 
దీంతో ఈ రిసార్టులో ధనవంతులు, విదేశీ పర్యాటకులు మాత్రమే బస చేస్తుంటారు. గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలు అత్యంత సౌకర్యవంతంగా ఉండేందుకు సకల సదుపాయాలూ ఉన్నాయి. అయితే వారిని బయట వ్యక్తులతో, కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వకుండా చేశారన్నది వివాదాస్పదంగా మారింది. సెల్‌ఫోన్లు కూడా లాగేసుకున్నారని పలువురు ఎమ్మెల్యేలు వాపోగా, మరికొందరు రిసార్టులో బాగానే ఎంజాయ్‌ చేశారని చెప్పుకొంటున్నారు. విలాసవంతంగా హోటళ్లలో ఎంజాయ్ చేస్తున్న ఈ ఎమ్మెల్యేలు చిన్నమ్మకు విశ్వాసంగా ఉంటారో లేక అమ్మకు విధేయుడైన పన్నీర్‌కు ఓటేస్తారో తెలియాలంటే వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments