హమ్మయ్య... మరో ప్రజారాజ్యం-2: మెగా ఫ్యామిలీలో మళ్లీ చెయ్యి పెట్టిన కత్తి మహేష్

కత్తి మహేష్. పవన్ కళ్యాణ్‌ గురించి వ్యాఖ్యలు చేసి ఆ తరువాత బాగానే ఇరకాటంలో పడ్డారు. ఎలాగోలా బయటకు వచ్చి మళ్ళీ సినిమా రివ్యూలు చెప్పుకుంటున్నారు. అయితే సినిమా రివ్యూల సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని పట్టించుకోకుండా తను అనుకున్నదాన్ని నిర్మొహమాటంగ

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (18:46 IST)
కత్తి మహేష్. పవన్ కళ్యాణ్‌ గురించి వ్యాఖ్యలు చేసి ఆ తరువాత బాగానే ఇరకాటంలో పడ్డారు. ఎలాగోలా బయటకు వచ్చి మళ్ళీ సినిమా రివ్యూలు చెప్పుకుంటున్నారు. అయితే సినిమా రివ్యూల సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని పట్టించుకోకుండా తను అనుకున్నదాన్ని నిర్మొహమాటంగా చెబుతూ వస్తున్నాడు. ప్రస్తుతం కత్తి మహేష్ మరోసారి ఇబ్బందుల్లో పడిపోయాడు. అది కూడా పవన్ కళ్యాణ్‌, మెగా ఫ్యాన్స్ కారణంగానే. 
 
అసలేమైందంటే... చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడు జనసేన పార్టీలో చేరారు. మెగా ఫ్యామిలీ అంతా జనసేనకి సపోర్ట్‌గా ఉంది. హమ్మయ్య మొత్తానికి జనసేన, ప్రజారాజ్యం-2 అయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయంటూ చెప్పాడు. అంతటితో ఆగలేదు. మెగా ఫ్యామిలీ మొత్తం రాజకీయ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది అన్నాడు. 
 
ఇదంతా ఇప్పుడు అటు పవన్, ఇటు చిరంజీవి ఫ్యాన్స్‌లో తీవ్ర ఆగ్రహావేశాలను తెప్పిస్తోంది. పవన్ పైన మొదట్లో ఆరోపణలు చేసిన తరువాత మళ్ళీ అలాంటి పని చేయనని చెప్పిన కత్తి మహేష్ మళ్ళీ అలాంటిదే చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా పవన్, చిరు అభిమానులు కత్తి మహేష్‌ను తిట్టిపోస్తున్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

డ్యూడ్ రూ.100 కోట్ల కలెక్షన్లు : హ్యాట్రిక్ కొట్టిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments