Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరాముడుపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల్ని నాగబాబు ఖండించడం తప్పా?(Video)

కత్తి మహేష్‌ వివాదంలో చిక్కుకున్నారు. టివి ఛానల్‌ చర్చల్లో రామాయణాన్ని ఒక పుస్తకం మాత్రమేనని అభివర్ణించిన మహేష్‌…. శ్రీరాముడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్ని హుందూ సంఘాలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అదలావుండగా మహేష్‌ కత్తిని అర

శ్రీరాముడుపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల్ని నాగబాబు ఖండించడం తప్పా?(Video)
, గురువారం, 5 జులై 2018 (19:14 IST)
కత్తి మహేష్‌ వివాదంలో చిక్కుకున్నారు. టివి ఛానల్‌ చర్చల్లో రామాయణాన్ని ఒక పుస్తకం మాత్రమేనని అభివర్ణించిన మహేష్‌…. శ్రీరాముడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్ని హుందూ సంఘాలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అదలావుండగా మహేష్‌ కత్తిని అరెస్టు చేయాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోకుంటే చారిత్రక తప్పిదం చేసిన వారవుతారని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తేలిగ్గా తీసుకుంటే ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారంటూ వ్యాఖ్యానించారు.
 
ఐతే నాగబాబు ఈ వివాదంలో తలదూర్చడంపై మిశ్రమ స్పందన వస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ పైన కత్తి మహేష్ కత్తి కట్టి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో నాగబాబు లైన్లోకి వచ్చారనే వాదనలు వినబడుతున్నాయి. కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు కొంతమంది మనోభావాలను గాయపరిచిందని కొందరు అంటంటూ అసలాంటి వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని నాగబాబు అన్నారు. 
 
ఐతే ప్రత్యేకించి ఎవరైనా ఓ మతంపైన, వారి మనోభావాలను గాయపరిచే రీతిలో ప్రవర్తించరాదన్నది తెలిసిన విషయమే. కానీ కత్తి మహేష్ వివాదంలో ఉన్నత స్థానంలో వున్న నాగబాబు లైన్లోకి రాకుండా వుంటే బాగుండేదని మరికొందరు అంటున్నారు. మరి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించడం తప్పా... ఒప్పా... మీరేమి అనుకుంటున్నారో చెప్పేయండి. నాగబాబు వ్యాఖ్యలు... వీడియో... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ సరసన ఒకప్పటి కలలరాణి సిమ్రాన్..?