కాపులకు రిజర్వేషన్లు ఇప్పట్లో లేనట్లే.. ముద్రగడ ఏం చేస్తారు?

కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళన అంతాఇంతా కాదు. పాదయాత్ర మొదలుపెడితే ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అసలు ఇంటి నుంచే పద్మనాభంను బయటకు రానివ్వకుండా అడ్డుకుంది. ఇక ఆందోళన చేసే పరిస్థితి ముద్రగడకు లేకుండా పోయి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (14:56 IST)
కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆందోళన అంతాఇంతా కాదు. పాదయాత్ర మొదలుపెడితే ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అసలు ఇంటి నుంచే పద్మనాభంను బయటకు రానివ్వకుండా అడ్డుకుంది. ఇక ఆందోళన చేసే పరిస్థితి ముద్రగడకు లేకుండా పోయింది. కానీ ఎలాగైనా ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లను సాధించుకుని తీరుతామన్న ధీమాలో ముద్రగడ ఉన్నారు. ముద్రగడకు సగం మంది కాపులు మద్ధతు తెలిపితే, మరో సగంమంది వ్యతిరేకిస్తున్నారు.
 
ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇస్తుంటే ముద్రగడ అనవసర రాద్దాంతం చేస్తున్నారనేది కొంతమంది కాపులు చెబుతున్న వాదన. అయితే నంద్యాలలో కాపులు ఎక్కువగా ఉండటంతో వారందరినీ తమవైపు లాక్కునే ప్రయత్నం చేయబోయారు ముఖ్యమంత్రి. మూడురోజుల క్రితం అత్యవసరంగా కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులతో సమావేశమైన చంద్రబాబు రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే రిజర్వేషన్లను ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. దీంతో కాపులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిపిస్తారనేది బాబు ఆలోచన.
 
అందుకే బాబు ఒకవైపు నుంచి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పట్లో కాపులకు రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జస్టిస్ మంజునాథన్‌తో కూడిన కమిటీ నివేదిక, ఆ తరువాత ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పడేయడం, రిజర్వేషన్లతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవడం చూస్తుంటే కాపులకు రిజర్వేషన్లను ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి రిజర్వేషన్లపై ముద్రగడ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

Arnold Schwarzenegger: వేటలో చిక్కుకున్న వేటగాడు కథతో ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments