Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపు ఉద్యమం కొత్త పంథా తొక్కనుందా...?

కాపు ఉద్యమాన్ని తన భుజాలపై మోస్తున్న ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఎన్నోసార్లు ఆక్షేపించారు ముద్రగడ. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేసి, ఎన్నోరోజులు గృహనిర్బంధంలో ఉన్న

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (19:53 IST)
కాపు ఉద్యమాన్ని తన భుజాలపై మోస్తున్న ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఎన్నోసార్లు ఆక్షేపించారు ముద్రగడ. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేసి, ఎన్నోరోజులు గృహనిర్బంధంలో ఉన్నారు కూడా. చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమాన్ని తన అధికారంతో అణగదొక్కగలిగాడు కానీ, కాపుల్లో అసంతృప్తిని, టిడిపిపై ద్వేషాన్ని తగ్గించలేకపోయాడని వాపోతున్నారు ముద్రగడ అభిమానులు.
 
భవిష్యత్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాపు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనే దానిమీద ముద్రగడ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఐక్యకార్యాచరణ కమిటీ కీలక సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాపుల వ్యూహం ఏమిటి? గతంలో మోసం చేసిన పార్టీని గద్దె దింపేందుకు ఏం చేయాలి?
 
కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? ఇలాంటివాటిపై జెఏసీ నిర్ణయం ప్రకారం ప్రణాళిక ఉంటుందని ముద్రగడ పద్మనాభం ప్రకటించడం సంచలనాన్ని రేపింది. చంద్రబాబునాయుడు కాపు జాతికి చేసిన అన్యాయం దేశంలో ఎవ్వరికీ జరిగి ఉండదని ఈ సందర్భంగా ఉద్యమనేత ముద్రగడ ఆవేదనతో అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments