Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెడతా - బిజెపి అధ్యక్షుడు కన్నా

ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (21:01 IST)
ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని చెప్పారాయన. కేంద్రం నిధులు ఇచ్చినా ఏమీ ఇవ్వలేదంటూ టిడిపి నేతలు చెబుతుండడం మంచిది కాదన్నారు. అందుకే నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని చెప్పారు.
 
నాలుగేళ్ళలో ఖాళీగా కనిపించిన భూములను తెలుగు తమ్ముళ్ళు దర్జాగా కబ్జా చేసేశారని, వాటిని చంద్రబాబునాయుడు ప్రోత్సహించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎపిలో బిజెపి విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాలుగు సంవత్సరాల పాలన, అమలు చేసిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు సఫలీకృతులయ్యారన్నారు కన్నా లక్ష్మీనారాయణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments