Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆడియో కాల్ వైరల్.. నిమ్మగడ్డ సీరియస్ అవుతారా..?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (12:01 IST)
బలవంతపు ఏకగ్రీవాలను అంగీకరించేది లేదని ఓవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సీరియస్‌గా చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు.. ఓ అభ్యర్ధిని పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని చెబుతున్న ఓ ఆడియో కాల్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
 
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థి అల్లుడికి యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఫోన్ చేశారని అభ్యర్ధి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్‌ వేసినందుకు కేసు పెట్టించి జైల్లో వేయిస్తానని ఎమ్మెల్యే బెదిరించారని అభ్యర్థి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడీ ఆడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు బెదిరించినట్టుగా ఆరోపిస్తున్న ఆడియో బయటపడటంతో అతనిపై కేసు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
 
అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కన్నబాబును కూడా అరెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు. అధికార పార్టీకి ఓ న్యాయం.. ప్రతిపక్షానికి ఓ న్యాయమా అంటూ పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments