Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిపై అత్యాచార యత్నం... సన్నివేశాలు సోషల్ మీడియాలో పోస్ట్(వీడియో)

కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారయత్నం చేసి ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా ఆ ద

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (20:33 IST)
కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారయత్నం చేసి ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టుతో యువతిపై వారు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... కనిగిరిలోని ఓ ప్రైవేటు కాలేజీలో సదరు యువతి చదువుతోంది. 
 
ఈ క్రమంలో కార్తీక్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. దానికి ఆమె తిరస్కరించింది. దీనిపై ఆగ్రహం చెందిన కార్తీక్ తన స్నేహితులు అనీల్, సాయిలను తీసుకుని యువతిని మంచిగా మాట్లాడుతూనే ఈ విషయంపై మాట్లాడదాం అంటూ కనిగిరి శివారు ప్రాంతంలోకి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ కార్తీక్ తనను ప్రేమించాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. అంతే... ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచార యత్నం చేశారు. 
 
ముగ్గురినీ ఎంత బ్రతిమాలాడినా రాక్షసుల్లా ఆమెపై అఘాయిత్యం చేయబోయారు. పైగా ఆ సన్నివేశాలను వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయాన్ని తల్లిదండ్రుల వద్ద చెప్పేందుకు యువతి భయపడింది. కానీ సోషల్ మీడియాలో పోస్టులు చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. టవీ9 వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments