భావన కేసులో పెద్ద చేప చిక్కింది. మలయాళ హీరో దిలీప్ అరెస్టు
తెలుగుతోపాటు పలు దక్షిణాది సినిమాల్లో నటించిన ప్రముఖ కథానాయికను కారులో లైంగిక వేధించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో ప్రమేయం ఉన్నదన్న అంచనాతో కేరళ పోలీసులు ప్రముఖ మలయాళ హీరో దిలీప్ అరెస్ట్ చేశారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్న
తెలుగుతోపాటు పలు దక్షిణాది సినిమాల్లో నటించిన ప్రముఖ కథానాయికను కారులో లైంగిక వేధించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో ప్రమేయం ఉన్నదన్న అంచనాతో కేరళ పోలీసులు ప్రముఖ మలయాళ హీరో దిలీప్ అరెస్ట్ చేశారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో దిలీప్ నిందితుడిగా ఉన్నారు. చివరకు ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించడంతో ఆయన్ను ఎట్టకేలకూ అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు.
ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. అశ్లీల ఫొటోలు తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్ సుని అనే వ్యక్తిని, నటి వాహనం డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మలయాళ ప్రముఖ హీరోల్లో ఒకరిగా ఉన్న దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్‌ను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.
షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న భావనను కిడ్నాప్ చేసేందుకు ఆమె దగ్గర గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు స్థానిక రౌడీషీటర్ ఒకరు యత్నించారు. ఆమె కారులోనే ఎక్కి లైంగికంగా వేధించి ఫొటోలు, వీడియోలు తీశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు దిలీప్ భార్య, నటి కావ్య కార్యాలయంలో కూడా ఇటీవలే తనిఖీలు చేశారు. చివరకు ఈ కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను అరెస్ట్ చేశారు.