Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాభికి చంద్రబాబు నుంచే ప్రాణహాని ... ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (13:01 IST)
టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణ హాని ఉంద‌ని, ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన సూచన అని వ్యాఖ్యానించారు.
    
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ మాట‌ను ప‌దే ప‌దే నొక్కి చెపుతూ, అవును చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభిని హత్య చేసి, ఆ నెపాన్ని వైసీపీ మీదకు నెట్టి సానుభూతి పొందాలనేది చంద్రబాబు తత్వం అని పేర్కొన్నారు. తాను చెప్పిన ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. 
 
అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళ దాడి చేయించిన చంద్రబాబు, ఇవాళ ఆయన అపాయింట్మెంట్ కోరడానికి సిగ్గుండాలన్నారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభిరామ్ కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంద‌ని, అది దేనికి దారితీస్తుందో చెప్ప‌లేమ‌ని, అందుకే, ఆయ‌న జాగ్ర‌త్త అని కుటుంబ స‌భ్యుల‌కు చెపుతున్నా అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మొత్తం మీద ప‌ట్టాభి వ్య‌వ‌హారం, ఆయ‌న అన్న మాట సృష్టించిన రాజ‌కీయ క‌ల‌క‌లం ఇప్ప‌ట్లో ఆగే సూచ‌న‌లు క‌న‌ప‌డ‌టం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments