కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (12:49 IST)
వైకాపా సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలోని ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళే రహదారిపై అక్రమంగా టోల్ ప్లాజా ఏర్పాటు చేసి కంటైయినర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీ పోలీసులు మరో కేసును నమోదు చేశారు. 
 
ఇదిలావుంటే అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై మరో కేసు నమోదు చేయడం గమనార్హం. అలాగే, అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి బెయిల్ వస్తుందా? రాదా? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వేళ బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

Sri Vishnu : ప్రతి యువకుడి కథ.. ట్యాగ్‌లైన్‌తో శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments