Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ వ్యభిచారం చేయమంటోంది.. నాన్న ప్రోత్సహిస్తున్నాడు...

కడప జిల్లాలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్న తల్లిదండ్రులే తమ కుమార్తెల జీవితాలను చేజేతులా నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ నలుగురు కుమార్తెలను అమ్మ వ్యభిచారం చేయమని ఒత్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (10:21 IST)
కడప జిల్లాలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్న తల్లిదండ్రులే తమ కుమార్తెల జీవితాలను చేజేతులా నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ నలుగురు కుమార్తెలను అమ్మ వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తుంటే.. నాన్న కూడా అలానే ప్రోత్సహిస్తున్నాడు. దీంతో దిక్కుతోచని ఆ నలుగురు అక్కా చెల్లెళ్లు జిల్లా జడ్జి జి.శ్రీనివాస్‌కు ఓ లేఖ రూపంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. 
 
జిల్లా జడ్జి శ్రీనివాస్‌కు నలుగురు బాలికలు రాసిన లేఖలోని వివరాలను పరిశీలిస్తే... మేము నలుగురం అక్కాచెళ్లెళ్లం. మేము బాగా చదువుకుంటున్నాం. అయితే మా అమ్మానాన్న మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అలాగే హమాలీగా పని చేసే మా నాన్న కూడా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 
 
మా అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నవారు మమ్మల్ని కూడా వ్యభిచారం రొంపిలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరికి అమ్మ కూడా సహకరిస్తు మాపై ఒత్తిడి తెస్తున్నారు. అలాంటి జీవితం మాకు వద్దు. మేము బాగా చదువుకుని ప్రయోజకులం కావాలని ఉంది. మా అమ్మానాన్నకి బుద్ధి చెప్పండి .. సార్ అంటూ వేడుకున్నారు. 
 
ఈ లెటర్ చదివిన జడ్జి చలించిపోయారు. వెంటనే మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ అధికారికి ఆదేశించారు. పిల్లల వివరాలు సేకరించి, మంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అలాగే, తల్లిదండ్రులు, అక్రమ సంబంధం పెట్టుకున్నవారు, ఒత్తిడి తెస్తున్న వారిపై కేసులు నమోదు చేయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం