Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు... జ్యూడీషియల్ అధికారిగా నాగార్జున!

Webdunia
మంగళవారం, 18 మే 2021 (11:26 IST)
ఏపీలోని అధికార వైకాపా పార్టీ రెబెల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్మీ ఆసుపత్రిలోని ముగ్గురు వైద్యుల బృదం ఆయనకు వైద్య పరీక్షలు చేయనుంది. 
 
మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ నాగార్జునను జ్యుడీషియల్ అధికారిగా హైకోర్టు నియమించింది. కాసేపటి క్రితమే ఆర్మీ ఆసుపత్రికి నాగార్జున చేరుకున్నారు. ఈయన పర్యవేక్షణలో ఆర్మీ ఆసుపత్రి వైద్యులు రఘురాజుకు అన్ని పరీక్షలను నిర్వహించనున్నారు.
 
మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేయనున్నారు. టెస్టు రిపోర్టులను తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు అందజేయనుంది. మరోవైపు, తాము తదుపరి ఉత్తర్వులను వెలువరించేంత వరకు రఘురాజును ఆసుపత్రిలోనే ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆసుపత్రిలో ఉన్న కాలాన్ని రిమాండ్‌లో ఉన్నట్టుగా భావించాలని తెలిపింది.
 
మరోవైపు, ఆసుపత్రి వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటుచేశారు. ఇదేసమయంలో ఇది ఆర్మీ ఆసుపత్రి అయిన నేపథ్యంలో, సైనికాధికారులు మీడియాను కూడా సమీపంలోకి రానివ్వడం లేదు. ఇంకోవైపు, ఆర్మీ ఆసుపత్రి ఇచ్చే మెడికల్ రిపోర్టులో ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయో అనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments