Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌తో జూనియర్ ఎన్టీఆర్ మామ మంతనాలు?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (14:13 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, నార్నే ఇండస్ట్రీస్ అధినేత నార్నే శ్రీనివాస రావు సమావేశమ్యాయారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిన భేటీ అని ఆయన చెబుతున్నప్పటికీ... నిజానికి నార్నే శ్రీనివాస రావు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్న ఉద్దేశ్యంతోనే సమావేశమైనట్టుగా ప్రచారం సాగుతోంది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా అధికార టీడీపీ నుంచి భారీగా వైకాపాలోకి వలసలు జరుగుతున్నాయి. నేడో రేపో మరో ఎంపీ, మరో మంత్రి కూడా వైకాపాలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి తండ్రి, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నార్నే శ్రీనివాస రావు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
పైగా, ఎన్నికల సమయంలో ఇది మరింత రాజకీయ వేడిని పెంచింది. అయితే, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని నార్నే శ్రీనివాస రావు మీడియాతో అన్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిశానని చెప్పారు. జగన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని... ఈ క్రమంలోనే ఆయనను కలిశానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీలోకి నార్నే శ్రీనివాసరావు చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ పార్టీలో అప్పుడు ఆయన చేరలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments