Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్టిచ్చిన పాపానికి గొంతు కోశాడు...

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (13:41 IST)
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. లిఫ్టిచ్చిన పాపానికి ఓ వ్యక్తి గొంతు కోసి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్, గాజులరామారం డివిజన్ చంద్రగిరి నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చంద్రగిరి నగర్‌కు చెందిన ఇమ్రాన్(28) అనే వ్యక్తి వృత్తిరీత్యా వంట మనిషి. రాత్రి శ్రీరామ్‌ నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పనులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి బైక్‌పై బయలుదేరాడు. 
 
మార్గమధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగ్గా బైక్‌పై ఎక్కించుకొని వెళుతున్న సమయంలో వెనుక కూర్చొని తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇమ్రాన్ గొంతుకోసి పరారయ్యాడు. దీంతో రక్తపుమడుగులో పడివున్న ఇమ్రాన్‌ను స్థానికులు గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments