Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న అనకాపల్లిలో జాబ్‌ మేళా

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:54 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఈనెల 23వ తేదీన పొకర్న ఇంజనీర్‌డ్‌ స్టోన్‌ (క్వాన్‌ట్రా) సంస్థలో ఉద్యోగాల భర్తీకి జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు ఏపీఎస్‌ఎస్‌డీసీ విశాఖ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు.

ఇండస్ట్రియల్‌ కస్టమైజ్డ్‌ స్కిల్‌ ట్రెనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లిలోని దాడి ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఆ రోజు ఉదయం పది గంటలకు ఈ జాబ్‌ మేళా ప్రారంభమవుతుందన్నారు. 2018 నుంచి 2020 మధ్య డిప్లొమా ఇన్‌ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, సిరమిక్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ జాబ్‌ మేళాలో పాల్గొనేందుకు అర్హులన్నారు.

డిప్లొమా ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు 9000092227, 9292553352 సెల్‌ నంబర్లను సంప్రతించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments