Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ గెలిస్తే ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళా : వంగలపూడి అనిత

టీడీపీ గెలిస్తే ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళా : వంగలపూడి అనిత
, శనివారం, 6 మార్చి 2021 (10:40 IST)
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ప్రతి ఆరు నెలలకొకసారి నగరాల్లో జాబ్ మేళా నిర్వహిస్తాం. ఉద్యోగాల కల్పనలో వైసీపీ పూర్తిగా విఫలమైంది.

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రతి ఆరు నెలలకొకసారి జాబ్ మేళా నిర్వహించి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నాం. పోటీ జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీడీపీ గెలవబోతోంది.

గెలిచిన వెంటనే ఈ జాబ్ మేళాలు ప్రారంభమవుతాయి. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2014 నుండి 2019 మధ్యకాలంలో 5,13,000కు పైగా ఉద్యోగాలను 39,450 ప్రైవేటు కంపెనీల్లో కల్పించారు. ఈ మాటలు స్వయాన వైసీపీ ప్రభుత్వమే కౌన్సిల్ లో అంగీకరించింది. 

టీడీపీ ఐదేళ్ల పాలనలో 5 లక్షల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు రాష్ట్రానికొచ్చాయి. ఐటీ రంగంలో 5వేల ఉద్యోగాలు ఉన్న పరిస్థితి నుంచి 20 నెలల్లో 35 వేల ఉద్యోగాలను కల్పించిన ఘనత టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కే దక్కుతుంది.

కానీ గత 21 నెలల్లో రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాలేదు. ఒక్క ఉద్యోగ కల్పన జరగలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితులు కల్పించారు. ఉన్న పరిశ్రమలను కూడా కమిషన్ల పేరుతో బెదిరించి తరిమేశారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు కూడా వైసీపీ నేతల అరాచకాలు, బెదిరింపులకు భయపడి 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కిపోయాయి. లోపభూయిష్టమైన విధానాల వలన నిరుద్యోగం పెరిగింది. 

విధాన రూపకల్పనలో లోపాలు, శాంతిభద్రతలు కాపాడటంలో వైఫల్యం, మితిమీరిన అవినీతి కారణంగా పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాంతి స్ధాపన‌కు రోటరీ ఇంటర్నేషనల్ కృషి అభినందనీయం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్