Webdunia - Bharat's app for daily news and videos

Install App

శత్రువు ఉండరాదన్నదే సీఎం జగన్ లక్ష్యం... అందుకే ఎంతకైనా తెగిస్తుంది...

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (10:51 IST)
తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై ఆయన అన్న, మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు ఈ రాష్ట్రంలో శత్రువు అనేవాడు ఉండకూడదన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారని ఆరోపించారు. ఇందుకోసం ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందన్నారు. పైగా, ఇంకా నాలుగేళ్లు వుందని, ఈ సమయంలో ఎంత మందిని అరెస్టు చేస్తారో తెలియదన్నారు. 
 
ముఖ్యంగా ఒక యేడాది కాలాన్ని పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇపుడు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు. అందుకే వారిని వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం తమకు ఏకైక మార్గం కోర్టును ఆశ్రయించి, బెయిల్ పొందడమేనని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, తాము కొనసాగిస్తున్న ట్రావెల్స్ వ్యాపారంలో తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, తమ్ముడు కొడుకు అస్మిత్ రెడ్డిలకు ఎలాంటి పాత్ర గానీ, సంబంధంగానీ లేదన్నారు. అంతేకాకుండా, దేవుడంటే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం భయం లేదనీ, అలాగే, చట్టాలను కూడా ఆయన గౌరవించడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments