Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్యాస్ ఘటనపై కేటీఆర్ షాక్.. ఎక్కువగా పీల్చేయడంతోనే ఇబ్బంది?

గ్యాస్ ఘటనపై కేటీఆర్ షాక్.. ఎక్కువగా పీల్చేయడంతోనే ఇబ్బంది?
, గురువారం, 7 మే 2020 (10:45 IST)
వైజాగ్ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. అయితే విష వాయువును పీల్చడం కారణంగా ఆరుగురు చనిపోయారని డీజీపీ వెల్లడించారు. మరో ఇద్దరు ఈ సమస్య నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మరణించారని తెలిపారు.
 
అయితే ఈ గ్యాసేమీ ప్రాణాంతకం కాదని.. దీని కారణంగా అనారోగ్యానికి గురైన వారంతా వెంటనే డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నామన్నారు. అయితే సమస్యంతా ఈ గ్యాస్‌ని ఎక్కువ మొత్తం పీల్చినవారితోనేనని డీజీపీ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో పని చేసే వర్కర్స్ అంతా ఆ పరిసరాల్లోనే ఉంటారని.. వారికి ఇది మరింత ప్రమాదకరమన్నారు.
 
మరోవైపు విశాఖపట్నంలోని విషవాయువు లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ షాక్‌ అయ్యారు. ఈ మేరకు ఈ ఘటనపై ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు కేటీఆర్ సానుభూతి వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను టీ అడిగితే.. భర్తను కట్టేసి కొట్టింది..