Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడికి అన్నీ తెలుసు... తెలియదనుకోవడం మన అవివేకం.. జగన్‌పై జేసీ కామెంట్స్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. వాడికి (జగన్) అన్నీ తెలుసని, వాడికి ఏమీ తెలియదు అనుకోవడం మన అవివేకమన్నారు.

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (09:44 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. వాడికి (జగన్) అన్నీ తెలుసని, వాడికి ఏమీ తెలియదు అనుకోవడం మన అవివేకమన్నారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ జగన్ ఢిల్లీలో పలువురుని కలుస్తుండటంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురంలో మరోమారు స్పందించారు. 
 
ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్తే ఏం ప్రయోజనమన్నారు. రాష్ట్రపతి ఏం చేస్తారని, కాసిన్ని కాఫీ ఇచ్చి.. పరిశీలిస్తామంటూ చెప్పి పంపుతారని అన్నారు. దీని గురించి ఇక్కడున్న ముఖ్యమంత్రి వద్దకు కానీ, లేదా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వద్దకు కానీ వెళితే తగిన సమాధానం లభిస్తుందన్నారు. అన్నీ తెలిసిన పేర్లే అంటూ... ఊరికే వాళ్ల దగ్గరకు వెళ్లి చెప్పుకుంటే ఏం ప్రయోజనమన్నారు. 
 
మనం దేవుడి దగ్గరకు ఎందుకెళ్తాం... ఆపద్బాంధవా కాపాడు తండ్రీ అని మొక్కోవడానికి వెళ్తామని జేసీ అన్నారు. జగన్ కూడా అంతేనని... తనపై ఉన్న ఈడీ కేసుల నుంచి కాపాడాలని కోరుకోవడానికే ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి తప్పించండని అడుక్కోవడానికే మావాడు ఢిల్లీకి వెళ్లాడని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments