Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం భారమే : టీడీపీ నేత జేసీ

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (16:09 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టి వందరోజులు పూర్తి చేసుకుంది. దీన్ని వైకాపా శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. అయితే, టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ మోహన్ రెడ్డిని చేయిపట్టుకుని నడిపించేవాడు కావాలన్నారు. అలాగే, ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూపి లోపాలను సరిద్దాలని కోరారు. అంతేగానీ, దాన్ని నేలకేసి కొట్టొద్దని ఆయన పిలుపునిచ్చారు. 
 
పైగా, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేదు కానీ, ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే అవుతుందన్నారు. అంతటితో ఆగని ఆయన..'మా వాడు చాలా తెలివైనవాడు..' అంటూ వైఎస్ జగన్‌కు జేసీ కితాబిచ్చారు. రాజధాని అమరావతిలోనే ఇక్కడే ఉంటుందని.. ఎక్కడికీ తరలిపోదని మాజీ ఎంపీ జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన వైకాపా వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో జేసీ దివాకర్ పోటీ చేయకుండా ఆయన కుమారుడిని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలోకి దించారు. కానీ, ఆయన ఫ్యాను గాలికి చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో జగన్ చెంతకు చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments