Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఒక సైకో.. మహానటుడు.. చెంప పగులకొట్టండి.. నాగబాబు

సెల్వి
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (20:26 IST)
Nagababu
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  అధికారం చేతికొచ్చిన తర్వాత తండ్రి ఫొటోను పక్కన పడేశాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజల బతుకులను ఛిద్రం చేసిన వ్యక్తి అని దుయ్యబట్టారు. ఆస్తి కోసం సొంత తల్లిని, తోడబుట్టిన చెల్లిని గెంటేసిన స్వార్థపరుడని మండిపడ్డారు. సీఎం జగన్ ఒక సైకో అని, అద్భుత నటుడు అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. 
 
రానున్న ఎన్నికల్లో జనసేన - టీడీపీదే విజయమని సర్వేలన్నీ చెపుతున్నాయని తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ... కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే అవి సహజ మరణాలు అని అసెంబ్లీలో చెప్పిన ఘనత జగన్‌దని ఫైర్ అయ్యారు. ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను చెంప పగలగొట్టి.. కాలర్ పట్టుకుని తమ ప్రాంతానికి ఏం చేశారని ధైర్యంగా అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
ప్రజలకు నష్టం కలిగించిన వారిని, భూ కబ్జాలు చేసే వారిని జనసేన-టీడీపీ అధికారంలోకి వచ్చాక చెవులు మెలేసి మరి జైలుకు పంపుతామన్నారు. పిల్లలు, యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని జనసేన-టీడీపీ కూటమికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నాగబాబు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments