Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సీఎం కావడం మన దౌర్భాగ్యం: పవన్

సీఎం చంద్రబాబు నాయుడు ఏడూ కొండల స్వామి తిరుపతి లడ్డూలను ఢిల్లీకి ఇస్తే వారు పాచిపోయిన లడ్డు ఇచ్చారు. బీజేపీని నిలువరించింది తానేనని మొదటి నుంచి బీజేపీని ప్రశ్నించానని, బీజేపీని పొగిడింది... సన్మానించింది టీడీపీయే అని చెప్పారు. ప్రత్యేక హోదాపై 34 సార్

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (20:34 IST)
సీఎం చంద్రబాబు నాయుడు ఏడూ కొండల స్వామి తిరుపతి లడ్డూలను ఢిల్లీకి ఇస్తే వారు పాచిపోయిన లడ్డు ఇచ్చారు. బీజేపీని నిలువరించింది తానేనని మొదటి నుంచి బీజేపీని ప్రశ్నించానని, బీజేపీని పొగిడింది... సన్మానించింది టీడీపీయే అని చెప్పారు. ప్రత్యేక హోదాపై 34 సార్లు రాష్ట్ర ప్రభుత్వం మటమార్చిందన్నారు. నదులు ఉన్నా, చెరువులు ఉన్నా, గెడ్డలున్నా సాగునీరు అందని పరిస్థితి అని విమర్శించారు. 
 
తీర్థం, స్వార్థం రెండూ కూడా తెలుగుదేశానికి కలిసొచ్చాయనీ, ఆండ్ర ప్రాజెక్టు పూర్తి చేసేందుకు డబ్బులు లేవు కానీ పుష్కరాలకు మాత్రం డబ్బులు వస్తాయా అని ప్రశ్నించారు పవన్. ఏమి ఆశించి టీడీపీకి మద్దతు ఇచ్చానో ఆ ఆశలు ఆడియాసలు అయ్యాయనీ, మిమ్మల్ని సీఎంగా ఎంచుకోవడం మా దౌర్భాగ్యం అంటూ మండిపడ్డారు. 
 
ఎన్డీఏ భాగస్వామి నేత రామ్‌విలాస్ పాస్వాన్ తన రాష్ట్రానికి రైల్వే జోన్ తెచ్చుకుంటే, కేంద్రమంత్రిగా ఉన్న మన అశోక్ గజపతిరాజు ఒక్క ఎక్స్‌ప్రెస్  రైలును నిమిషం కూడా గజపతినగరం రైల్వే స్టేషన్లో ఆపలేని దుస్థితి అని తెలియజేశారు. మా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి, మా తండ్రి ఎప్పుడు మాపై ఆధారపడలేదు. పెన్షన్ పైన ఆధారపడ్డారు. సీపీఎస్ విధానం వల్ల నేడు ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు. పవన్ విమర్శలకు యువత నుంచి పెద్దఎతున స్పందన రావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ గారికి నటించడమేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments