Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశానికి జనసేన పార్టీ దూరం... దూరం..

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల సంఘం కమిషనరు నీలం సాహ్ని శుక్రవారం నిర్వహించనున్న సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఆయన ఆరోపించారు. అందుకు నిరనసనగా శుక్రవారం ఎస్ఈసీ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. 
 
కాగా, గురువారం సాయంత్రం ఎస్ఈసీ ఆహ్వానాన్ని పంపారని, ఈలోపే పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా చెప్తారని పవన్ ప్రశ్నించారు. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్యన్నారు. 
 
మరోవైపు, ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ హై కోర్టులో జననేస పార్టీ పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు రాకముందే ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ది చేకూర్చడానికేనని పవన్ ఆరోపించారు. 
 
మరోవైపు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షమై తెలుగుదేశం పార్టీ పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపా పాల్పడిన అరాచకాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments