Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీలో హోదాలు ఉండవ్.. అందరూ కార్యకర్తలే... పవన్ కళ్యాణ్‌కు కూడా...

జనసేన పార్టీ జిల్లా వ్యాప్తంగా నిర్వాహకుల ఎంపిక కోసం వినూత్న రీతిలో టాలెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తికాగా, మరికొన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి.

Webdunia
ఆదివారం, 21 మే 2017 (13:09 IST)
జనసేన పార్టీ జిల్లా వ్యాప్తంగా నిర్వాహకుల ఎంపిక కోసం వినూత్న రీతిలో టాలెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తికాగా, మరికొన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. అయితే, జనసేన పార్టీలో కార్యకర్తలు తప్ప నేతలు ఉండరన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కార్యకర్తల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న అధిష్టానం పార్టీ నిర్మాణంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
 
ప్రజా సమస్యలను ప్రశ్నించడమే లక్ష్యంగా చెబుతున్న జనసేనలో నాయకులకు చోటులేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే వారికి ఎటువంటి హోదాలు ఇవ్వరు. చివరికి పవన్ కల్యాణ్‌కు కూడా. జిల్లాల్లోనూ ఎవరికీ ఎలాంటి పదవులు ఉండవు. అందరూ జన సైనికులుగానే ఉంటారు. 
 
ప్రస్తుతం ఎంపిక చేస్తున్న వారిలో చురుకైన వారికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎంపికైన వారితో పవన్ నేరుగా మాట్లాడుతున్నారు. ఇలా ఎన్నికైన వారు ఆయా జిల్లాల పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments