అయ్యా జగన్ గారూ.. నా పెళ్లిళ్ళ వల్లే మీ దొంగల ముఠా జైల్లో చిప్పకూడు తిన్నదా? పవన్

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (14:45 IST)
తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తన పెళ్లిళ్ళ వల్లే మీరు జైలుకెళ్లి చిప్పకూడు తిన్నారా జగన్ అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు జనసేన శతఘ్ని టీమ్ కౌంటర్ ఇచ్చింది. 
 
తాజాగా పవన్ పెళ్లిళ్లపై జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో 'పవన్ కల్యాణ్‌ని కూడా అడుగుతున్నా.. అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తున్నారో అడుగుతున్నాను' అని జగన్ చేసిన వ్యాఖ్యలను శతఘ్ని వీడియోలో వినిపించింది.
 
దానికిందనే జగన్‌కు పవన్ ఇచ్చిన కౌంటర్‌ను కూడా జతచేసింది. అందులో పవన్... 'జగన్‌ని అడగాలనుకుంటున్నాను నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్ర విభజన జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే మీరు జైలుకెళ్లా? తమాషాగా ఉందా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు' అని అన్నారు.
 
'వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా పవన్ కల్యాణ్‌గారిని ఎదుర్కోలేని చేవలేని, చేతగాని, అసమర్థ జగన్‌లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి‌గా ఉండటం రాజకీయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం. మమ్మల్ని కూడా మీలాగా బరితెగించి మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమంటారా జగన్ రెడ్డి?' అని శతఘ్ని టీమ్ ప్రశ్నించింది. 'మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కల్యాణ్‌గారి పెళ్లిళ్ల వల్లే అంట నిజమా జగన్?' అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments