ఆ పని చేస్తే అందరిబాగోతం బయటపడతుంది : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు ట్వీట్ చేశారు. ఆ పని చేస్తే అందరిబాగోతం బయటపడుతుందంటూ హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై యుద్ధం ప్రకటించిన పవన్ కల్యాణ్

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (10:40 IST)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు ట్వీట్ చేశారు. ఆ పని చేస్తే అందరిబాగోతం బయటపడుతుందంటూ హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై యుద్ధం ప్రకటించిన పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్న విషయంతెల్సిందే.
 
ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు, సీఈవో రవిప్రకాశ్‌పై విరుచుకుపడిన పవన్ ఆ తర్వాత కొద్దిసేపటికే మరో సంచలన ట్వీట్ చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు జరపాల్సిందిగా తెలంగాణ పోలీసులను అభ్యర్థించనున్నట్టు పవన్ ప్రకటించారు. 
 
ఈదెబ్బతో తనను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పురుషులు, మహిళ జాతకాలు అన్నీ బయటకు వస్తాయని, అది క్రమంగా అమరావతి వైపు దారి తీస్తుందంటూ సంచలన ట్వీట్ చేశారు. దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు, రాజకీయ నాయకులు, మీడియా పెద్దలు, వారి పిల్లలు.. అందరూ బయటకు వస్తారన్నారు. 'మీరందరూ కలిసి నడి రోడ్డుపై ఓ సోదరి బట్టలు ఇప్పించేలా ప్రోత్సహిస్తే దానిని మీడియా చూపించింది. అన్ని 'షో'లకు అది కారణమైంది' అని పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments