Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్నాకే జగన్ పాదయాత్ర.. ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇడుపాయలో మొదలై ఇచ్చాపురంలో ముగియనుందని వైసీపీ శ్రేణులు స్పష్టత నిచ్చాయి. కడప జిల్లాలో ఇడుప

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (09:00 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇడుపాయలో మొదలై ఇచ్చాపురంలో ముగియనుందని వైసీపీ శ్రేణులు స్పష్టత నిచ్చాయి. కడప జిల్లాలో ఇడుపులపాయతో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తన పాదయాత్రను ముగించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. 
 
ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. ఇప్పటికే పాదయాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి అక్టోబరులోనే ఆయన పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా వేశారు. నవంబరు 2న జగన్ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానుంది.
 
పాదయాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుంటారు. అనంతరం ఇడుపులపాయ చేరుకుని పాదయాత్రకు శ్రీకారం చుడతారు. తొలుత కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర చేస్తారు. అనంతరం ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా సాగి ఇచ్చాపురంలో ముగుస్తుందని వైకాపా వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

పూరీ జగన్నాథ్ గతిని రామ్ పోతినేని మార్చనున్నాడా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న త్రివిక్రమ్.. పవన్ కోసమేనా? (Video)

కుర్రకారుని కైపుగా వెక్కిరిస్తున్న రష్మిక మందన్నా

డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప-2' దిరూల్‌ విడుదల

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments