Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరైనా సరే.. తోలు తీసేయండి : జగన్‌ ఆదేశాలు

Webdunia
సోమవారం, 27 మే 2019 (11:26 IST)
ఏపీ కాబోయే ముఖ్యమంత్రిని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కలుస్తున్నారు. ఇక రాష్ట్రపాలనకు గుండెకాయ లాంటి సీఎస్‌, డీజీపీలు కూడా జగన్‌ను కలసి శుభాకాంక్షలు అందజేశారు. ఆ సమయంలో కొద్దిసేపు జగన్ వారితో మాట్లాడారు. తన పాలన తీరుతెన్నులను వారికి రేఖామాత్రంగా వివరించారు. 

ప్రత్యేకంగా ఐపీఎస్‌ గౌతం సవాంగ్‌‌తో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారని తెలుస్తోంది. రాయలసీమ 4 జిల్లాలకు స్ట్రిక్ట్, డైనమిక్‌, యంగ్‌, ఎనర్జిటిక్‌ ఐపీఎస్‌లను రెడీ చేయమని చెప్పారట. ఇకపై రాయలసీమలో ఒక్క ఘటన కూడా జరగకూడదని ఆదేశాలిచ్చారని తెలుస్తోంది. 
 
24 గంటల్లో.. అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ల జాబితా నాకు కావాలి. అలాంటి వారు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే.. డిప్యుటేషన్ పైన రప్పించే అవకాశాలున్నా పరిశీలించండి అని జగన్ గౌతం సవాంగ్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. 
 
అలాగే చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లా కలక్టర్ పారదర్శకంగా, స్ట్రిక్టుగా ఉండాని చెప్పారట. శాంతిభద్రతల విషయంలో ఎవరైనా సరే జోక్యం చేసుకుంటే తోలు తీసేయండి అంటూ జగన్‌ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఇక జగన్ మార్కు పాలన ప్రారంభమైనట్టే.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments