Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నారా?

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (19:54 IST)
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు చక్కని అవకాశం ఇచ్చింది. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని ఉన్నా, ఆర్థికంగా స్తోమతలేని వారికి జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అర్హులైన విద్యార్థులకు చేయూతనిస్తోంది. వరల్డ్ టాప్-100 విద్యాసంస్థలు, వర్సిటీల్లో అడ్మిషన్ సాధించినవారికి ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 
 
ఇక, 101 నుంచి 200 లోపు ర్యాంకు కలిగిన ప్రపంచ విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందినవారికి ఆయా విద్యాసంస్థల ఫీజులను అనుసరించి 50 శాతం ఫీజు కానీ, రూ.50 లక్షలు కానీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ మేరకు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
 
దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబరు 30. అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ వెబ్ సైట్ (https://jnanabhumi.ap.gov.in/)లో దరఖాస్తు చేసుకోవాలి.
 
క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో టాప్-200 లో ఉన్న విదేశీ వర్సిటీలు, విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ వర్గాల విద్యార్థులు జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలో 60 మార్కులు, లేదా, అందుకు సమానమైన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ చదవాలనుకునేవారు నీట్ రాసి అర్హత పొంది ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments