జగన్ నేమ్ ప్లేట్ సిద్ధం.. సోషల్ మీడియాలో వైరల్.. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా?

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (09:31 IST)
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వేళ, వైకాపా పార్టీకి ప్రజలు పట్టం కడుతారని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. వైకాపా అభిమానులు విజయం సాధించేది తామేనని ఘంటాపథంగా చెప్తున్నారు.. సీఎంగా జగన్ రానున్నారని అంటూ, ఆయన పేరిట నేమ్ ప్లేట్‌ను తయారు చేయించి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 
 
"వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు" అంటూ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కనిపిస్తున్న నేమ్ ప్లేట్ ఇప్పుడు తెగ షేర్ అవుతోంది. నిన్నటికి నిన్న చంద్రబాబు, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ మార్ఫింగ్ ఫోటోను షేర్ చేయగా, అది కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. తన అసమర్థత, వైఫల్యాలను చంద్రబాబు వ్యవస్థలపై తోసివేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 2014లో చంద్రబాబు ఈవీఎంలతోనే గెలిచాడని గుర్తుచేశారు. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు తమకున్న అవలక్షణాలను ఎదుటివారికి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ స్పీకర్ కోడెలపై దాడి ఘటనలో వైసీపీ నేత అంబటి సహా ముగ్గురు పార్టీ నేతలపై పోలీసులు కేసు పెట్టడంపై బొత్స మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నడలోనూ అద్భుతమైన టాక్‌తో షెరాజ్ మెహదీ.. ఓ అందాల రాక్షసి

Faria Abdulla: సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ లో చిత్రం

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై చిల్డ్రన్ మూవీగా సమ్మర్ హాలిడేస్

Akira Nandan: అకీరా నందన్ ఫస్ట్ మూవీ ఎవరితో తెలుసా?

నా జీవితంలో ఆ కథ ముగిసిపోయింది : మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments