సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

ఠాగూర్
ఆదివారం, 22 జూన్ 2025 (16:30 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ ప్రయాణించిన కారు ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటనపై  పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్‌ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి  సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో జగన్ ఉన్న కారు ముందు డ్రైవర్ వైపున ఉండే చక్రం కింద పడిచనిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం తెలిసినా డ్రైవర్ కారు ఆపకుండా వెళ్లిపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? ఆ సమాచారాన్ని జగన్‌కు తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్‌ కారు డ్రైవర్‌ నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. మరోవైపు జగన్‌ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు. 
 
మరోవైపు, ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతికి కారణమైన వారిపై ముఖ్యంగా జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా తన కాన్వాయ్ కారణంగా సొంత పార్టీ కార్యకర్త మరణిస్తే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంతో జగన్ తీరును పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments