Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మార్చే హక్కు జగన్‌కి లేదు: సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (08:36 IST)
బీసీజీ కమిటీపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోస్టన్ రిపోర్ట్‌లో బీసీజీ సభ్యుల సంతకాలు మాత్రమే ఉంటాయని, సీఎం జగన్ చెప్తే ఎంపీ విజయసాయిరెడ్డి రిపోర్ట్ రాశారని ఆరోపించారు. రాజధాని మార్చే రాజకీయ హక్కు జగన్‌కి లేదని చెప్పారు.

ప్రభుత్వం సమాధులు సిద్ధం చేసింది.. రైతులకా? ప్రభుత్వానికా త్వరలో తెలుస్తుందని నారాయణ హెచ్చరించారు. అసెంబ్లీ, సచివాలయం ఒక దగ్గరే ఉండాలని, మొగుడు ఒక చోట.. పెళ్ళాం ఒక చోట ఉండొద్దని సూచించారు.

ఇక నుంచి ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టుకెళ్లాల్సిందేనని, పాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు. మందడంలో మహిళలపై దాడులు దారుణం పోలీసులా.. డెకాయిట్లా అని నారాయణ నిలదీశారు.
 
రాజధాని అమరావతిపై బీసీజీ తుది నివేదికను జగన్‌ మోహన్‌రెడ్డికి అందజేసిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికను అందజేశారు. రాజధాని, అభివృద్ధిపై సీఎంకు బీసీజీ ప్రతినిధుల నివేదిక అందించారు.

రాజధానిపై ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 6న రెండు నివేదికలనూ హైపవర్‌ కమిటీ పరిశీలించనుంది. అనంతరం 8న రెండు నివేదికలపై కేబినెట్‌ చర్చించనున్నది. హైపవర్‌ కమిటీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సారథ్యాన ఈ నెల 6వ తేదీన తొలిసారిగా సమావేశం కానుంది. ఈ కమిటీ 3 వారాల్లో తన తన సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments