Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ భూముల అమ్మకాలపై జగన్ బ్రేకులు, ప్రక్రియ నిలిపివేత

Webdunia
సోమవారం, 25 మే 2020 (21:24 IST)
టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గింది. టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

2016, జనవరి 30న టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత పాలకమండలి నిర్ణయాన్ని నిలిపివేస్తూ జీవో నెంబర్‌ 888 విడుదల చేశారు.

భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయంపై టీటీడీ పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించింది.

ఆధ్యాత్మికవేత్తలు, ధర్మప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులో ప్రభుత్వం టీటీడీకి సూచించింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకూ భూముల వేలం నిలిపివేయాలని నిర్ణయించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments