Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోల్డ్ ఏపీగా జగన్ పాలన: తెలుగుదేశం పార్టీ

Advertiesment
Jagan
, మంగళవారం, 19 మే 2020 (06:10 IST)
జగన్ ఏడాది పాలనలో 900మంది రైతుల ఆత్మహత్యలు భాదిస్తున్నాయి అని తెలుగుదేశం పార్టీ కృష్ణ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు ఆవేదన వ్యక్తంచేశారు.

మచిలీపట్నం లోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసి రైతు భరోసా పేరిట ఒక్కొక్క రైతుకు రూ78.500 మేర మోసం చేశారు అని ప్రభుత్వం పై అర్జునుడు విమర్శలు గుప్పించారు. ఏడాది వైకాపా పాలనలో 900మంది రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం అని అన్నారు.

ఇది ఇలావుంటే కేంద్రం సరిగా నిధులు విడుదల చేసిన ఆ బిల్లులను చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నారు అని అర్జునుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డ్ఏపీ పేరట రాష్ట్రాన్ని సోల్డ్ ఏపీగా మార్చారు అని పేదలకు ఇళ్ళు, స్థలాల ముసుకులో వైకాపా నేతలు భారీ స్కాముకు తెర తీశారని అర్జునుడు ఆరోపించారు.

కారు చౌకగా ప్రజల ఆస్తులను కొట్టేయాలని వైకాపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న భూములను మార్కెట్ వాల్యూ కు ఆమితే తిరిగి కొనాలంటే రెండున్నర రేట్లు అదనంగా చెలించాల్సి ఉంటుందని దీనితో ప్రజల పై మోయలేని భారం పడుతుందని అర్జునుడు ఆందోళన వ్యక్తం చేశారు. అస్సలు ప్రజల ఆస్తులను అమ్మే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది అని నిలదీశారు. 
 
చివరికి ప్రాజెక్టుల్లో నీళ్లను కూడా అమేస్తున్నారు అని ఇటివల సోమశిల ప్రోజెక్టుల 10వేల క్యూసెక్కుల నీళ్లు అమ్ముకునట్లు మీడియాలో కథనాలు వచ్చాయి అని అర్జునుడు తెలిపారు. మరోవైపు కరోనా కిట్ల తయ్యారు, మాస్క్ లు, శానిటైజరులు, బ్లీచింగ్ లో కూడా భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఏడాది పాలనలో గతనికన్న ముడురెట్లు అప్పులు చేశారు అన్నారు.

మరోవైపు ప్రజల పై కరెంట్ ఛార్జీల భారం, పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచి మరో భారం మోపరని అర్జునుడు మండిపడ్డారు. రైతులకు 6వేలు ఎగొట్టడం భరోసానా అని ప్రశ్నించారు? ఒక్కో రైతుకు ఏడాదికి 6వేల చప్పున 5ఏళ్లలో 30వేలు ఎగొట్టడం ద్వారా రైతు భరోసా పేరిట ఈ వైకాపా ప్రభుత్వం రైతులను మోసం చేసింది అన్నారు.

రైతు భరోసా పథకం కింద అదనంగా 17వేలు ఇస్తున్నట్లు జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అసత్యం అని అర్జునుడు ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉంటే అన్నదాత సుఖీభవ కింద ఏడాది కి 15వేలు చొప్పున్న ఒక్కో రైతుకు 5ఏళ్లలో 75వేలు 4,5 విడతల రుణమాఫీ కిస్తీలు రూ.40వేలు కలిపి ఒక్కో రైతుకు రూ1.15 లక్షలు వచ్చేవి అన్నారు.

వైకాపా ప్రభుత్వం మోసం వల్ల ఒక్కో రైతు రూ78,500 నష్టపోయారు అని అర్జునుడు ధ్వజం ఎత్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కృష్ణ జిల్లా కార్యదర్శి పి.వి.ఫణి కుమార్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళగిరిలో పచారి షాపులు మినహా ఏ షాపులకూ అనుమతి లేదు