Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వదేశీ - విదేశీ వస్తువులను వేర్వేరు ర్యాకుల్లో ఉంచాలి : ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

Advertiesment
స్వదేశీ - విదేశీ వస్తువులను వేర్వేరు ర్యాకుల్లో ఉంచాలి : ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
, మంగళవారం, 19 మే 2020 (05:54 IST)
స్వదేశీ వస్తువుల  వినియోగాన్ని ప్రోత్సహించడానికి, విదేశీ వస్తువుల వాడకాన్ని బాగా తగ్గించడానికి గౌరవనీయులైన ఏపీ హైకోర్టు వారి జోక్యాన్ని కోరుకుంటూ జంగటి అమర్నాథ్ బిజెపి రాష్ట్ర కార్య వర్గ సభ్యునీ తరఫున హైకోర్ట్ న్యాయవాది, ఎల మంజుల బాలాజీ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని  దాఖలు చేశారు.

భారతదేశం దాదాపు 50740 కోట్ల రూపాయల విలువైన 4450 వస్తువులను222 దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది. కానీ 20580 కోట్ల రుపాయల విలువగల వస్తువులను మాత్రమే ఎగుమతి చేస్తున్నది. ఎగుమతుల కన్నా దిగుమతులు చాలా ఎక్కువగా ఉండడంవల్ల రూపాయి మారకపు విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే  76 రూపాయలకు పడిపోయింది.

అంతేకాకుండా భారతదేశం నిరుద్యోగ శాతం7.4 కు పెరిగింది. కరోనా ప్రభావము గా లాక్ డౌన్  విధించడం  వలన భారతదేశపు ఆర్థిక స్థితి చాలా దెబ్బతింది. GDP కనిష్ట స్థాయికి చేరుకొన్నది. ఇటువంటి పరిస్థితులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ వస్తువులు లేదా స్థానిక వస్తువులను కొనుగోలు చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.

అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యులు అయినా భారతీయులు ఏ వస్తువులు స్వదేశీ,  ఏ వస్తువులు విదేశీ అని తెలుసుకోలేక  పోతున్నారు .కావున ప్రతి షాపింగ్ మాల్ లోనూ, సూపర్ బజార్ లోనూ స్వదేశీ మరియు విదేశీ వస్తువులను వేరువేరుగా వేర్వేరు ర్యాకుల్లో ఉంచాలని, ఈ దిశలో ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టు వారిని కోరారు.

ఇందువలన ప్రతి ఒక్క భారతీయ కొనుగోలుదారుడు  తనకు ఇష్టం వచ్చిన స్వదేశీ వస్తువులను కొనుగోలు  చేసే అవకాశం ఉంటుందని కోర్టు వారికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా అన్ని రకాలైన మిలిటరీ, పోలీస్ క్యాంటీన్ లలో స్వదేశీ వస్తువులను కూడా తప్పనిసరిగా అమ్మకానికి ఉంచాలని ఆదేశించి విషయాన్ని కూడా కోర్టుకి తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్కువ టెస్టులు చేసి పాజిటివ్ కేసులు గుర్తించండి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి