Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను పారిస్‌కు పంపేందుకు బెంగళూరు వెళ్లిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (11:02 IST)
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం బెంగళూరుకు చేరుకున్నారు. రాత్రికి ఎలహంకలోని తన నివాసంలో బస చేయనున్నారు. సీఎం పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు దక్కించున్న విషయం తెలిసిందే. తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు వైఎస్‌ జగన్‌ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. 
 
సీఎం జగన్‌ రాకతో బెంగళూరు విమానశ్రయం వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు.
 ప్రపంచంలోని టాప్‌ 5 బిజినెస్‌ స్కూల్స్‌లో ఇన్సీడ్‌ ఒకటి. అక్కడ హర్షారెడ్డి మాస్టర్స్‌ చేయనున్నారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్‌ సాధించారు. 
 
ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ(ఎంఎన్‌సీ)లో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా.. దానిని వదులుకుని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయడానికి మొగ్గు చూపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments