Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదే ఖర్మ... టీటీడీ ఛైర్మన్‌గా ఓ క్రిస్టియనా? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (19:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా ఒక క్రిస్టియన్‌ను నియమించారని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మంపై ఎందుకంత కోపమని ఆయన ప్రశ్నించారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో ఒక క్రిస్టియన్‌గా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని తితిదే ఛైర్మన్‌గా జగన్ నియమించారని, ఇది అత్యంత దారుణమని చెప్పారు. కేవలం హిందువులనే టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలన్న డిమాండ్ చేసారు. ఇప్పటికైనా ఏపీలోని హిందువులు మేల్కోవాలని, లేకపోతే నష్టం తప్పదని, ఏపీలో హిందువులు చేసే పోరాటాలకు తాము అండగా ఉంటామని ఆయన చెప్పారు. 
 
అలాంటి వారినే టీటీడీ ఛైర్మెన్‌గా నియమించాలి : పురంధేశ్వరి 
 
హిందూ ధర్మంపై పూర్తిగా నమ్మకం ఉన్నవారినే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా నియమించాలని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. అదేసమయంలో ఈ పదవి ఒక రాజకీయ పునరావాస పదవి కారాదన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఆ పదవికి న్యాయం చేయగలరని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం సోమవారంతో ముగిసింది. కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈయన తితిదే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇది రెండోసారి. గతంలో సీఎంగా వైఎస్ఆర్ ఉన్న సమయంలో కూడా ఆయన ఒకసారి తితిదే ఛైర్మన్‌గా పని చేశారు. 
 
అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక నల్లరాయితో పోల్చారు. ఇది పెద్ద వివాదమైంది. ఇపుడు ఆయన్నే తితిదే ఛైర్మన్‌గా నియమించడాన్ని అనేక హిందూవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేస్తూ, "ఇంతకుముందు వైకాపా ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేపట్టింది. దానిపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపివేశారు. ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాసంగానే పరిగణిస్తోందని అర్థమవుతోంది. తితిదే ఛైర్మన్‌ పదవికి హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారిని.. ఆ ధర్మాన్ని అనుసరించేవారినే నియమించాలి. అన్య మతస్తులను కాదు" అని పురందేశ్వరి ట్వీట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం