Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ గ్రోత్ ఇంజిన్.. ఇక్కడే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా.. జగన్

సెల్వి
గురువారం, 9 మే 2024 (15:49 IST)
ఆంధ్రప్రదేశ్‌కు వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాను సీఎంగా వైజాగ్‌లో ఉండగలిగితే పదేళ్ల తర్వాత ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని జగన్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతో వైజాగ్ సమానంగా ఉంటుంది. 
 
వచ్చే ఎన్నికల తర్వాత వైజాగ్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారు. విజయవాడ, అమరావతి, గుంటూరులో చేయలేని మౌలిక సదుపాయాలను వైజాగ్‌లో రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు.
 
ఈ ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, రైతాంగం, ప్రజా సంక్షేమం, మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేశామన్నారు. అవి మాత్రమే కాకుండా పోర్టులు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి రాజధాని నుంచి తన పరిపాలన ప్రారంభిస్తాడో.. అప్పుడు ఈ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకే ఈసారి ఆయన ప్రమాణస్వీకారం విశాఖ నగరం నుంచే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments