Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు - పోలీస్ శాఖకు మినహాయింపు

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభంకానుంది. ఇందుకోసం ఆయా జిల్లాలకు ఉద్యోగుల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా, డివిజన్ స్థాయి ఉద్యోగుల వరకు మాత్రమే ఈ మార్పులు చేర్పులు చేసింది. అయితే, పోలీస్ శాఖను మాత్రం మినహాయించింది. 
 
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలను లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన 26 జిల్లాలు ఏర్పాటుచేశారు. నిజానికి ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు మాత్రమే వున్నాయి. ఆ ప్రకారంగానే జిల్లాలు ఏర్పాటు చేయాల్సివుంది. కానీ, అరకు స్థానం వైశాల్యంలో పెద్దది కావడంతో ఈ లోక్‌సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. దీంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. 
 
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరిపాలనను ప్రారంభించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అదేసమయంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనను ప్రారంచాలని స్పష్టం చేసింది. దీంతో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపును ప్రారంభించింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లోని పునర్‌వ్యవస్థీకరించిన ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు పని చేయడం ప్రారంభిస్తాయని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments